John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్‌ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!

John Campbell Hits Fastest ODI 100 for West Indies vs India: భారత్‌తో గువాహటి వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్ ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ శివాలెత్తాడు. 68 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. 65 బంతుల్లోనే శతకం పూర్తి చేసిన క్యాంప్‌బెల్.. భారత్‌పై వెస్టిండీస్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన విండీస్‌ బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో రికార్డో పావెల్, మార్లన్ శామ్యూల్స్, షిమ్రాన్ హెట్మెయర్ వంటి స్టార్ బ్యాటర్లను అధిగమించాడు. భారత్‌పై వెస్టిండీస్ తరఫున వేగవంతమైన వన్డే సెంచరీల జాబితాలో ఇప్పటివరకు రికార్డో పావెల్ ఉన్నాడు. అతడు 72 బంతుల్లో సెంచరీ చేశాడు. 2002లో మార్లన్ శామ్యూల్స్ 73 బంతుల్లో, 2018లో షిమ్రాన్ హెట్మెయర్ 74 బంతుల్లో శతకాలు నమోదు చేశారు. 2019లో హెట్మెయర్ మరోసారి 85 బంతుల్లో శతకం బాదాడు. ఇప్పుడు జాన్ క్యాంప్‌బెల్ 65 బంతుల్లో సెంచరీతో ఈ జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. అంతేకాదు వెస్టిండీస్ తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాటర్ల జాబితాలోనూ క్యాంప్‌బెల్ నిలిచాడు. ఈ జాబితాలో దిగ్గజం బ్రియాన్ లారా 45 బంతుల్లో శతకం చేసి అగ్ర స్థానంలో ఉన్నాడు. క్రిస్ గేల్ 55 బంతుల్లో, ఎవిన్ లూయిస్ 61 బంతుల్లో, నికోలస్ పూరన్ 63 బంతుల్లో సెంచరీలు సాధించారు. తాజాగా క్యాంప్‌బెల్ 65 బంతుల్లో శతకం బాదాడు. అయితే సెంచరీ పూర్తిచేసుకున్న వెంటనే క్యాంప్‌బెల్ పెవిలియన్‌కు చేరాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్ తొలి బంతికి గర్నూర్ బ్రార్ వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన క్యాంప్‌బెల్.. నమన్ ధీర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో తొలి వన్డేలో సెంచరీ చేసిన జస్టిన్ గ్రీవ్స్ మాదిరిగానే.. రెండో వన్డేలోనూ సెంచరీ చేసిన వెంటనే వెస్టిండీస్ ఓపెనర్ ఔటయ్యాడు. భారత్‌పై వెస్టిండీస్ తరపున అత్యంత వేగవంతమైన వన్డే సెంచరీ: వెస్టిండీస్ తరఫున అత్యంత వేగవంతమైన వన్డే సెంచరీ: