సీఈసీ జ్ఞానేష్ కుమార్ ను తొలగించాలి

న్యూఢిల్లీ : ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ (స‌ర్ ) ప్రక్రియకు సంబంధించి ముగ్గురు సభ్యులున్న ఎన్నికల సంఘం లోనే ఇద్దరు కమిషనర్లు పదేపదే అభ్యంతరాలు లేవనెత్తినట్లు ఒక వార్తా వెబ్‌సైట్ కథనం వెల్లడించడంతో రాజకీయంగా పెద్ద దుమారం రేగింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ “ఏకపక్ష నియంతృత్వ ధోరణి”తో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి. ఓటర్ల జాబితా ప్రక్షాళన సమయంలో వివిధ రాష్ట్రాల్లో పేర్ల తొలగింపు వంటి అనేక అంశాలపై ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి అభ్యంతరాలు వ్యక్తం చేశారని అధికారులు తెలిపారు. అయితే, దేశవ్యాప్త ఓటర్ల జాబితా ప్రక్రియకు సంబంధించిన నిర్ణయాల విషయంలో మాత్రం కమిషన్ ఏకాభిప్రాయంతోనే వ్యవహరించింది. స‌ర్ ప్రక్రియ దేశవ్యాప్త అమలు ముగ్గురు కమిషనర్ల పర్యవేక్షణలోనే జరిగింది. కానీ, తమకు తెలియకుండానే నిర్ణయాలు తీసుకోవడం , ఆదేశాలు జారీ చేయడంపై గత 10 నెలల్లో సంధు, జోషి కనీసం 14 సార్లు (ఒకే రోజు నాలుగు సార్లు సహా) అధికారికంగా అభ్యంతరాలు వ్యక్తం చేశారని ఆ ఆంగ్ల దినపత్రిక కథనం పేర్కొంది. మహారాష్ట్ర ఓటర్ల జాబితా: 2.06 కోట్ల పేర్ల తొలగింపుపై విచారణ జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ విభాగం ఇన్‌ఛార్జ్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ఈ మీడియా కథనం స్క్రీన్‌షాట్‌న ఎక్స్ లో పంచుకున్నారు. భారత ఎన్నికల సంఘం విశ్వసనీయతను , సమగ్రతను సీఈసీ ఎలా దెబ్బతీశారో అనే అంశంపై ప్రముఖ జాతీయ పత్రికలో వచ్చిన సంచలనాత్మక వివరాల గురించి పార్టీ తరపున తన సహచరుడు అభిషేక్ సింఘ్వీ మీడియాకు వివరంగా మాట్లాడతారని రమేష్ తెలిపారు. కుమార్ పదవిలో కొనసాగే అర్హత లేదన్న విషయంలో ఎటువంటి సందేహం లేదని కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ పేర్కొన్నారు. తన పైఅధికారి ఆదేశాల మేరకు ఒక వ్యక్తి తన ఇష్టానుసారం పేర్లను ఎలా తొలగించగలరు? అని ప్ర‌శ్నించారు. మన ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసేలా పూర్తిగా చట్టవిరుద్ధమైన చర్యలు తీసుకోవడానికి తోటి రాజ్యాంగబద్ధ అధికారులను ఎలా పక్కన పెట్టగలరు?” అని ఆయన నిల‌దీశారు. “ఓటు హక్కు అనేది ప్రతి పౌరుడికి లభించిన అత్యవసర రాజ్యాంగ బద్ధమైన అధికారం . మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభం వంటిది. ఒకవేళ దానిని తొలగించాల్సి వస్తే, అత్యంత పారదర్శకతతో కూడిన సరైన ప్రక్రియను అనుసరించాలి అని ఆయన అన్నారు. The post సీఈసీ జ్ఞానేష్ కుమార్ ను తొలగించాలి appeared first on TeluguISM - Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.